నర్సీపట్నం: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగాలు రుజువు కావడంతో ఏఎస్‌డబ్ల్యూవో ఎం.శ్యామలను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నాతవరం బాలికల వసతిగృహం విద్యార్థినులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ప్రధాన ఆరోపణ. వసతిగృహంలో సౌకర్యాలు లేక కొంతమంది విద్యార్థినిలు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అధికారుల విచారణలో ఏఎస్‌డబ్ల్యూవో పర్యవేక్షణ కొరవడిందని తేలడంతో ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఇన్చార్జి ఏఎస్‌డబ్ల్యూవోగా బీసీ హాస్టల్స్‌కు చెందిన ఏబీసీడబ్ల్యూవో గోపీనాథరావును జిల్లా అఽధికారులు నియమించడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment