108 సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన
బుచ్చెయ్యపేట : రాష్ట్ర ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు బుచ్చెయ్యపేట మండలం 108 వైద్య సిబ్బంది తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. శనివారం వైద్య సిబ్బంది 108 సర్వీస్‌ను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, 108 వైద్య సిబ్బంది అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మండల వైద్య సిబ్బంది ప్రవీణ్, వెంకినాయుడు, కుమారస్వామి, శ్రీనివాస్, ప్రసాద్ తదితరులు డిమాండ్ చేశారు. డిమాండ్లు సాధన కోసం ఈ నెల 25 నుంచి రాష్ట్రమంతా 108 వైద్య సిబ్బంది సమ్మె బాట పడుతున్నామని, అందరు ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment