పూడిమడక రోడ్డు విస్తరణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

పూడిమడక రోడ్డు విస్తరణకు చర్యలు

Published Thu, Nov 28 2024 2:02 AM | Last Updated on Thu, Nov 28 2024 2:02 AM

పూడిమడక రోడ్డు విస్తరణకు చర్యలు

పూడిమడక రోడ్డు విస్తరణకు చర్యలు

మునగపాక, తిమ్మరాజుపేటలలో పర్యటిస్తున్న ఆర్‌డీవో ఆయిషా

మునగపాక: పూడిమడక రోడ్డు విస్తరణ ప్రక్రియ వేగవంతం కావాలని, ఇందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అనకాపల్లి ఆర్డీవో ఆయిషా కోరారు. రోడ్డు విస్తరణకు సంబంధించి బుధవారం ఆమె మునగపాక, తిమ్మరాజుపేట, తదితర గ్రామాల్లో పర్యటించారు. ఏయే గృహాలు దెబ్బతింటాయన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది లబ్ధిదారులను గుర్తించారనే వివరాలు సేకరించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి మెరుగైన పరిహారం అందుతుందన్నారు. రోడ్డు విస్తరణకు అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రీ–సర్వే డీటీ పడాల్‌, వీఆర్వోలు సురేష్‌, హిమబిందు, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement