కక్ష కట్టి.. పక్కన పెట్టేశారా.!
కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు విశాఖ అభివృద్ధి ఊసే లేదు. కొత్త ప్రాజెక్టుల రూపకల్పనపై దృష్టి పెట్టలేదు. గత ప్రభుత్వంలో రూపొందించిన ప్రణాళికలను సైతం పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. దీంతో ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా వీఎంఆర్డీఏ తయారు చేసిన అనేక ప్రాజెక్టుల ప్రతిపాదనలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రాజెక్టుల రూపకల్పనకు రూ.కోట్లు వెచ్చించి రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు బుట్టదాఖలయ్యే పరిస్థితి కనిపిస్తున్నాయి. – విశాఖ సిటీ
విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విభిన్నమైన, ఆకర్షణీయమైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఇందుకు తగ్గట్టుగా విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) కొన్ని కీలక ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నేచురల్ హిస్టరీ పార్క్, ఓషన్ డెక్, అర్బన్ అమ్యూజ్‌మెంట్ పార్క్, సైన్స్ మ్యూజియం, కై లాసగిరిపై రివాల్వింగ్ రెస్టారెంట్, కాటేజీ ఇలా అనేక ప్రాజెక్టుల ఏర్పాటుకు డీపీఆర్‌లు సైతం రూపొందించింది. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం విశాఖలో ఒక్క పర్యాటక ప్రాజెక్టు చేపట్టకపోగా.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో తయారు చేసిన ప్రతిపాదనలపై తాజాగా కూటమి ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి.ప్రచారాలు చేస్తూ వచ్చింది. తాజాగా గత ప్రభుత్వ హయంలో ప్రతిపాదించిన ప్రాజెక్టులను పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పర్యాటక ప్రాజెక్ట్‌లకు కూటమి గ్రహణం
గత ప్రభుత్వ హయాంలో పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు
నాడు పర్యాటక ప్రాజెక్ట్‌లపై విష ప్రచారం
నేడు అధికారంలో ఉన్నా పట్టించుకోని వైనం
డీపీఆర్‌లకు వెచ్చించిన రూ.కోట్లు వృథా?
Comments
Please login to add a commentAdd a comment