ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకర ఉత్పత్తులు
కశింకోట: ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు సాగు చేసి ఆరోగ్యకరమైన ఉత్పత్తులను ప్రజలకు అందించాలని ప్రకృతి వ్యవసాయం జిల్లా అధికారి సిహెచ్.లచ్చన్న కోరారు. మండలంలోని సుందరయ్యపేట శివారు లాలం కొత్తూరులో కూండ్రపు అరుణ ఏర్పాటు చేసిన నూకాంబిక మెగా ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మినీ ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలను గ్రామాల్లో ఏర్పాటు చేసి, రైతులకు కషాయాలు, ద్రావణాలు, పీఎండీఎస్ విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. పంటలకు ఆశించిన తెగుళ్లు, పురుగులను సకాలంలో గుర్తించి నివారణకు అవసరమైన కషాయాలు తయారు చేసి రైతులకు అందించాలని సూచించారు. ఇలా రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలన్నారు. ప్రజలు కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించి ఆరోగ్యవంతులుగా జీవనం సాగించాలని సూచించారు. ఈ మెగా ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా మండలాల్లో కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం రీజనల్ అధికారులు ప్రకాష్, హేమసుందర్, జిల్లా యాంకర్ గోవింద, హెచ్‌ఆర్ శ్యామల, మార్కెటింగ్ ఇన్‌చార్జి వర్మ, డివిజనల్ ఇన్‌చార్జిలు శివకుమార్, తాసుబాబు, వెంకటలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment