త్వరితగతిన ‘అపార్’ ప్రక్రియ పూర్తి చేయాలి
అనకాపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అపార్ యాప్‌లో విద్యార్థుల వివరాల నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు సూచించారు. స్థానిక గవరపాలెం చిన్న హైస్కూల్ ఆవరణలో బుధవారం ఎంఈవోలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల హెంఎంలు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపార్ ప్రక్రియ ప్రైవేటు యాజమాన్య పాఠశాలల్లో చాలా మందకొడిగా ఉందన్నారు. దీనిపై ఎంఈవోలు దృష్టి సారించాలన్నారు. వచ్చేనెల 7న జరగనున్న పేరెంట్ టీచర్ మీటింగ్(పీటీఎం)ను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు త్వరితగతిన ఎఫ్‌ఏ 1, 2 మార్కుల సబ్మిషన్ పూర్తి చేయాలన్నారు. మెగా ిపీటీఎం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్‌కు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5 పాఠశాలలను విద్యా శాఖ నేరుగా ఎంపిక చేసిందన్నారు. ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజన పథకం బిల్లులను సకాలంలో ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలని ఆయన సూచించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటలకల్లా ఉపాధ్యాయుల బయోమెట్రిక్, 10.30 కల్లా స్టూడెంట్స్ అటెండెన్స్ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప విద్యాశాఖాధికారి అప్పారావు, జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment