నర్సీపట్నం: సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డికి మంగళవారం బెయిల్ మంజూరైంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సామాజిక మాధ్యమంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆయనపై నాతవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. నాతవరం మండలం లింగంపేటకు చెందిన టీడీపీ నాయకుడు దేవాడ అప్పలనాయుడు ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్, ఐటీ చట్టాలను అనుసరించి కేసు పెట్టారు. గుంటూరు జైల్లో రిమాండ్‌లో ఉన్న రవీంద్రారెడ్డిని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చిన నాతవరం పోలీసులు ఈ నెల 5న నర్సీపట్నం జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడంతో రవీంద్రారెడ్డిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. అదే రోజు న్యాయవాది మాకిరెడ్డి బుల్లిదొర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం బెయిల్ మంజూరైంది.
Comments
Please login to add a commentAdd a comment