అంతర్జాతీయ అబాకస్ పోటీల్లో దొండపూడి విద్యార్థిని ప్రతి
చోడవరం: రావికమతం మండలం దొండపూడి గ్రామానికి చెందిన విద్యార్థిని చుక్కల జ్యోష్యశ్రీ దేవాన్షి అంతర్జాతీయ అబాకస్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించింది. ఇంటర్నేషనల్ అబాకస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయి అబాకస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో దేశ, విదేశాల నుంచి 10 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఏ2 విభాగంలో జ్యోష్యశ్రీదేవాన్షి పాల్గొని ద్వితీయ స్థానం సాధించి ఈ ప్రాంత కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపింది. ఈమె విశాఖపట్నం సెయింట్ ఆన్స్ స్కూల్‌లో 4వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు లక్ష్మి, స్వామి ఉపాధ్యాయులుగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. విద్యార్థిని జ్యోష్యశ్రీదేవాన్షిని గ్రామస్తులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment