అనకాపల్లి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థుల అప్లికేషన్లు ఆన్‌లైన్లో పొందుపరిచామని, వీటిలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే సరిచేసుకోవాలని డీఈవో గిడ్డి అప్పారావునాయుడు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు గమనించాలన్నారు. సవరణ వివరాలు స్కూల్ రికార్డులు, అపార్ ఐడీ ప్రకారం ఉండాలని ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకూ సరిచేసి అప్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. 2025 మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకూ పది పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment