పంట కోత ప్రయోగంతో పక్కాగా దిగుబడి అంచనా
● జిల్లా డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ వైకుంఠరావు
దేవరాపల్లి: పంట కోత ప్రయోగాన్ని పారదర్శకంగా చేయడం ద్వారా వరి సాగులో దిగుబడిని పక్కాగా అంచనా వేయడం సాధ్యపడుతుందని జిల్లా డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ జి.వైకుంఠరావు అన్నారు. తామరబ్బ పంచాయతీ చినసోంపురం గ్రామంలో ప్రధా నమంత్రి పసల్ బీమా యోజన పథకంలో భాగంగా వరి పంట కోత ప్రయోగాన్ని మంగళవారం నిర్వహించారు. స్థానిక పంట పొలంలో 5 మీటర్ల పొడవు, వెడల్పు మధ్య వరి పొలాన్ని తీసుకొని సదరు పొలం దిగుబడి వచ్చిన ధాన్యాన్ని బరువు తూసి దిగుబడిన అంచనా వేశారు. స్థానిక రైతుకు చెందిన శ్రీకాకుళం సన్నాలు రకం వరి పొలంలో 15.20 కేజీల దిగుబడి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల వ్యవసాయ అధికారి వై.కాంతమ్మ, మండల విస్తర్ణాధికారి ఎస్.కిరణ్‌కుమార్, ఉద్యానవన సహాయ అధికారి డి.వరుణ్‌కుమార్, బీమా ఏజెంట్ సిహెచ్.వాసు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment