పరామర్శకు తోడు వెళ్లి.. అనంతలోకాలకు..
అక్కిరెడ్డిపాలెం: రాత్రి విధులు ముగించుకుని ఆస్పత్రిలో ఉన్న తమ బంధువును పరామర్శించడానికి ఒకరికి తోడు వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై మరణించాడు. గాజువాక ట్రాఫిక్ ఎస్‌ఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాలివీ.. శ్రీకాకుళం జిల్లా, బూర్జ మండలం, నారాయణపురం నాగావళి వీధికి చెందిన కునుబెల్లి రమేష్(30) అరబిందోలోని ఏపిటోరియా ఫార్మా కంపెనీలో కెమిస్ట్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. గాజువాకలో తన తమ్ముడితో కలిసి నివాసం ఉంటున్నాడు. అదే కంపెనీలో 68వ వార్డు అక్కిరెడ్డిపాలేనికి చెందిన కురిటి శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావు తన స్కూటీని పాత గాజువాకలో పార్కింగ్ చేస్తాడు. అక్కడ కంపెనీ బస్సు దిగి అక్కిరెడ్డిపాలేనికి స్కూటీపై వస్తుంటాడు. ఇదిలా ఉండగా సోమవారం నైట్ డ్యూటీ చేసి మంగళవారం ఉదయం కంపెనీ బస్సులో వచ్చిన వీరిద్దరూ పాత గాజువాక వద్ద దిగారు. శ్రీనివాసరావుకు చెందిన బంధువు గాజువాకలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో ఆయన్ని చూడటానికి ఇద్దరూ బయలుదేరారు. శ్రీనివాసరావు స్కూటీ నడుపుతుండగా రమేష్ వెనుక కూర్చున్నాడు. వారు ఆస్పత్రికి సమీపిస్తుండగా వెనుకనే వస్తున్న ఓ లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీ వెనుక కూర్చున్న రమేష్ కాళ్లు, నడుముకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మరణించాడు. శ్రీనివాసరావు తూలి పక్కకు పడిపోవడంతో భుజంపై గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. గాయాలపాలైన శ్రీనివాసరావుకు గాజువాకలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని లారీని స్టేషన్‌కు తరలించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టనున్నట్లు ఎస్‌ఐ విజయ్ కుమార్ తెలిపారు.
లారీ ఢీకొని కెమిస్ట్ మృతి
మృతుడు శ్రీకాకుళం జిల్లా వాసి
Comments
Please login to add a commentAdd a comment