కొండెంపూడి కేవీకేకి పురస్కారం వెల్లువెత్తిన అభినందనలు
బుచ్చెయ్యపేట: మండలంలోని కొండెంపూడి కృషి విజ్ఞన కేంద్రానికి రాష్ట్ర స్థాయిలోఉత్తమ కేవీకే పురస్కారం లభించడంపై అభినందనలు వెల్లువెత్తాయి. గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఎస్.ఢిల్లీరావు, ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మి దేవి చేతుల మీదగా కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె.రాజ్‌కుమార్, ఎన్.సత్తిబాబు, ఎ.సౌజన్య, ఎన్.కిషోర్, పి.బాబులు అవార్డు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. కొండెంపూడిలో కేవీకే ఏర్పాటు చేసిన ఆరు సంవత్సరాల్లో రైతులకు పలు సూచనలు,సలహాలు అందించారు. ఉత్తమ దిగుబడులు సాధించడం, నూతన వంగడాలను తయారు చేసి అందించడంలో కేవీకే శాస్త్రవేత్తలు విశేష కృషి చేశారు. ఈ ఏడాది మూడు లక్షలకు పైగా నాణ్యమైన నారు మొక్కలు తయారు చేసి రైతులకు అందించారు. కేవీకేకి అవార్డు లభించడంతో అభినందనలు వెల్లువెత్తాయి. అధికారులు, పలువురు రైతు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment