![నగదు పురస్కారాన్ని అందుకుంటున్న
కూచివారిపల్లి భజన బృందం సభ్యులు - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/26/25pdtr201-170049_12_8_mr_0.jpg.webp?itok=y_Z-HVNo)
నగదు పురస్కారాన్ని అందుకుంటున్న కూచివారిపల్లి భజన బృందం సభ్యులు
రాజుపాళెం (వైఎస్సార్ జిల్లా): హనుమద్ వ్రత మహోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని రాజుపాలెం మండలం వెల్లాల పుణ్యక్షేత్రంలో ఆదివారం రాత్రి నిర్వహించిన రాష్ట్రస్థాయి భజన పోటీల్లో అనంతపురం జిల్లా యల్లనూరు మండలం కూచివారిపల్లి సీతారామ భజన సంఘం మొదటి స్థానంలో నిలిచింది. సోమవారం మధ్యాహ్నం వరకూ కొనసాగిన పోటీలను పోటీలు ఆలయ చైర్మన్ విజయలక్ష్మి, ఈఓ బీవీ నరసయ్య, వైఎస్సార్‌సీపీ నాయకుడు కానాల బలరామిరెడ్డి పర్యవేక్షించారు. రెండో స్థానంలో రాప్తాడు మండలం మరూరు చిన్న కదరయ్య బృందం, ఏడో స్థానంలో నార్పల మండలం వెంకటాంపల్లె శ్రీరామ బృందం, 15వ స్థానంలో పామిడి దత్తాత్రేయ బృందం నిలిచాయి. విజేతలను అభినందిస్తూ నిర్వాహకులు నగదు పురస్కారాలతో సత్కరించారు. అలాగే ఉత్తమ గాయని, గాయకుడు, హార్మోనిస్ట్, తబలిస్ట్, కోరస్‌లకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున అందజేశారు. మొత్తం 45 భజన సంఘాలు పాల్గొనగా, న్యాయ నిర్ణేతలుగా కర్నూలు జిల్లాకు చెందిన తిరుపాలు, తెలంగాణలోని గద్వాల్‌కు చెందిన సత్తెన్న, వ్యాఖ్యాతగా తాడిపత్రి శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment