![చెక్కభజనలో కళాకారులు - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/15/14atpc124-600514_mr_0.jpg.webp?itok=KgEaZp3k)
చెక్కభజనలో కళాకారులు
ఎద్దుల బండిపై వస్తున్న డీఐజీ అమ్మిరెడ్డి,
ఎస్పీ అన్బురాజన్
అనంతపురం క్రైం: గ్రామీణ సంస్కృతికి దర్పణం పట్టేలా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఎడ్లబండ్లు, సంప్రదాయ దుస్తులు, పలకల కోలన్న, కర్రసాము, గోలీల ఆటలతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సందడి చేశారు. హోదాలు మరిచి సంబరాల్లో పాల్గొన్నారు. డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. భోగి మంటలు వెలిగించి గాలిపటాలు ఎగుర వేసి హరిదాసు ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం గ్రామీణ క్రీడలతో సందడి చేశారు. ఏఆర్ డీఎస్పీ మునిరాజు కర్రసాము, గంగిరెద్దుల విన్యాసాలు, చెక్క భజన కళాకారుల విన్యాసాలు, పోలీసు కుటుంబసభ్యుల చిన్నారుల భరత నాట్యం, హరిదాసు కీర్తనలు ఆకట్టుకున్నాయి. పోలీసు కుటుంబ సభ్యులు వేసిన ముగ్గులను పరిశీలించి విజేతలను అభినందించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎహనుమంతు, డీఎస్పీలు గంగయ్య, ప్రసాదరెడ్డి, ట్రైనీ డీఎస్పీ హేమంత్‌కుమార్, సీఐలు రెడ్డప్ప, శివరాముడు, ప్రతాపరెడ్డి, ఆర్‌ఐలు హరికృష్ణ, రాముడు, పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర సభ్యులు సూర్యకుమార్, జిల్లా పోలీసు అధికారుల సంఘం సభ్యులు సాకే త్రిలోక్‌నాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, శ్రీనివాసుల నాయుడు, సరోజ, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పోలీస్ పరేడ్ మైదానంలో
వేడుకగా సంక్రాంతి సంబరాలు
హోదాలు మరిచి సందడి చేసిన
అధికారులు
![భోగి మంటలు వెలిగిస్తున్న డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ అన్బురాజన్ 1](https://www.sakshi.com/gallery_images/2024/01/15/14atpc117-600514_mr.jpg)
భోగి మంటలు వెలిగిస్తున్న డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ అన్బురాజన్
Comments
Please login to add a commentAdd a comment