చెల్లినే చెరబట్టాడు! | - | Sakshi
Sakshi News home page

చెల్లినే చెరబట్టాడు!

Published Wed, Sep 11 2024 1:56 AM | Last Updated on Wed, Sep 11 2024 7:43 AM

-

అనంతపురం సిటీ: చెల్లెల్నే చెరబట్టిన ఓ కామాంధుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అనంతపురానికి కూతవేటు దూరంలోని ఓ గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. వివరాలు.. పద్నాలుగేళ్లు కూడా నిండని బాలిక ఐదో తరగతితో చదువు మానేసింది. కూలి పనులకు వెళ్తూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలోనే సొంత పెద్దమ్మ కుమారుడు బాలికపై కన్నేశాడు. వావివరసలు మరిచి మాయమాటలతో లోబరుచుకున్నాడు. తనకు అప్పటికే పెళ్లై, పిల్లలున్నా.. ఆ విషయం మరిచి బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. కుటుంబ సభ్యులకు విషయం చెప్పొద్దంటూ బెదిరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే గర్భం దాల్చిన బాలిక ఈ నెల 7న ఇంట్లోనే ప్రసవించింది. పుట్టిన కొంతసేపటికే బిడ్డ చనిపోయాడు.

ఆస్పత్రికి రాకతో వెలుగులోకి..
బాలికను ఈ నెల 8న కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. బాలిక వివరాలు నమోదు చేసుకున్న ఆస్పత్రి సిబ్బంది ఆమెను ప్రసూతి వార్డులో ఉంచారు. ఐసీడీఎస్‌ అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లారు. స్పందించిన ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి నగరంలోని సఖి వన్‌ స్టాప్‌ సెంటర్‌ మేనేజర్‌ శాంతామణి, సిబ్బందిని రంగంలోకి దింపారు. అనంతపురం, బాలిక సొంత మండలానికి చెందిన పోలీసులు బాధిత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కలిసి వివరాలు నమోదు చేసుకున్నారు.

బాధితులకు బెదిరింపులు..
బాలిక ప్రసవానికి కారకుడైన వ్యక్తిపై కేసు పెట్టేందుకు బాధిత కుటుంబ సభ్యులు సుముఖత చూపడం లేదని సమాచారం. కామాంధుడు దగ్గరి బంధువు కావడం, బాధితులను బెదిరిస్తుండడంతో కేసు నమోదుకు ముందుకు రావడం లేదని తెలింది. నిందితుడ్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పోక్సో కేసు నమోదు చేస్తామని ఐసీడీఎస్‌ పీడీ శ్రీదేవి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement