‘అపార్’పై దృష్టి సారించాలి
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థులకు సంబంధించి ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) నమోదుపై మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రాథమిక విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) శామ్యూల్ ఆదేశించారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆర్జేడీ స్థానిక డీఈఓ కార్యాలయం నుంచి ఎంఈఓలు, హెచ్‌ఎంలతో వెబెక్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపార్ పేరిట కేంద్ర ప్రభుత్వం జీవితకాల గుర్తింపు కార్డును ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. రాయలసీమ జిల్లాలు వెనుకబడి ఉన్నాయన్నారు. విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా పర్యటనకు వచ్చానన్నారు. అపార్ ఐడీతో నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట పడుతుందన్నారు. చిన్నచిన్న లోపాలను అధిగమించి ప్రతి పాఠశాల వందశాతం పూర్తి చేయాలన్నారు. ఎఫ్‌ఏ–1 మార్కుల నమోదులో అలసత్వం ఉండకూడదన్నారు. వందశాతం పూర్తి చేయాలన్నారు. అలాగే ఈ నెల 4 నుంచి ప్రారంభమయ్యే ఎఫ్‌ఏ–2 పరీక్షల మార్కుల నమోదు ఎప్పటికప్పుడు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్జేడీతో పాటు డీఈఓ ప్రసాద్‌బాబు పాల్గొన్నారు.
ప్రాథమిక విద్య ఆర్జేడీ శామ్యూల్
Comments
Please login to add a commentAdd a comment