జిల్లా అంతటా శనివారం పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు స్థిరంగా
శైవ క్షేత్రాలకు
ప్రత్యేక బస్సులు
అనంతపురం క్రైం: కార్తీక మాసాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజరు సుమంత్ ఆర్ ఆదోని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని పలు డిపోల నుంచి 300 బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించారు. అనంతపురం డిపో నుంచి శ్రీశైలం మల్లికార్జున క్షేత్రానికి 24 బస్సులు వెళ్తాయన్నారు. త్రిలింగ దర్శనం–1 (శ్రీశైలం, మహానంది, ఓంకారం) 8 ప్రత్యేక బస్సులు, త్రిలింగ దర్శనం–2 (బుగ్గ, యాగంటి, మహానంది) 12 బస్సులు నడుస్తాయన్నారు. అలాగే, అరుణాచలానికి 6 బస్సులు, లేపాక్షి–10 బస్సులు, ఆలూరు కోన–5, పొలతలకు 5 బస్సులతో కలిపి 70 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. గుత్తి డిపో నుంచి త్రిలింగ దర్శనం–1కి 2, త్రిలింగ దర్శనం–2కి 4 బస్సులు నడుపుతామన్నారు. గుంతకల్లు నుంచి శ్రీశైలం క్షేత్రానికి 12 బస్సులు, త్రిలింగ దర్శనం–1కి 4, త్రిలింగదర్శనం–2కి 8, అరుణాచలం 2 బస్సులతో కలిపి 26 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. కళ్యాణదుర్గం నుంచి శ్రీశైలానికి 24, త్రిలింగదర్శనం–1కి 4,త్రిలింగ దర్శనం–2కి 8, అరుణాచలం 2 బస్సులతో కలిపి 38, రాయదుర్గం నుంచి శ్రీశైలం–30, త్రిలింగదర్శనం–1కి 4, త్రిలింగదర్శనం–2కి 10, అరుణాచలం 4 బస్సులతో కలిపి 48, తాడిపత్రి నుంచి శ్రీశైలం–30, త్రిలింగ దర్శనం–1కి 8, త్రిలింగదర్శనం–2కి 12, అరుణాచలం–6, ఆలూరు కోన–2, పొలతలకు 10 బస్సులతో కలిపి 86 బస్సులు, ఉరవకొండ నుంచి శ్రీశైలం క్షేత్రానికి 12 బస్సులు, త్రిలింగదర్శనం–1కు 4, త్రిలింగదర్శనం–2కు 8, అరుణాచలం–2 బస్సులతో కలిపి మొత్తం 26 బస్సులు నడుస్తాయన్నారు. 50 మంది కలిసి వెళ్లాలనుకుంటే ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రిజర్వేషన్లు ప్రారంభమైనట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment