సప్తగిరి క్యాంఫర్‌లో ఆరుగురికి అస్వస్థత
శింగనమల: లోలూరు పంచాయతీలోని బి.కొత్తపల్లి సమీపంలో ఉన్న సప్తగిరి క్యాంఫర్ ఫ్యాక్టరీలో రియాక్టర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఆరుగురు సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సప్తగిరి క్యాంఫర్ ఫ్యాక్టరీలో ఆర్–3 రియాక్టర్ చెడిపోయింది. మరమ్మతు పనులను మధ్యాహ్న సమయంలో చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన సౌరయ్య, బుక్కరాయసముద్రానికి చెందిన హరిబాబు, కల్లూరుకు చెందిన క్రిష్ణ, అనంతపురానికి చెందిన రియాక్టర్ ఇన్‌చార్జ్ నాగేంద్రప్రసాద్, శ్రీకాకుళంకు చెందిన లక్ష్మీనారాయణ, ఓబిలేసు మరమ్మతు పనులకు ఉపక్రమించారు. రియాక్టర్‌లో చిన్న చిన్న రంధ్రాలుంటే వాటిని వెల్డింగ్ చేయడానికి ముగ్గురు రియాక్టర్‌లోకి దిగారు. కానీ కింద విద్యుత్ ఎర్త్ ఉండడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే పైనున్న వారు వారిని కాపాడానికి ప్రయత్నించగా వారూ కింద పడిపోయారు. ఒకరి మీద ఒకరు పడిపోవడంతో, వెంటనే గుర్తించిన మిగిలిన సిబ్బంది ఫ్యాక్టరీని షట్‌డౌన్ చేశారు. రియాక్టర్‌లో పడిపోయిన వారిని బయటకు తీశారు. వారందరూ అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఫ్యాక్టరీ వాహనాల్లో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వారిలో నాగేంద్ర ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న సీఐ కౌలుట్లయ్య, ఎస్‌ఐ శరత్‌చంద్ర సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
రియాక్టర్‌లో మరమ్మతులు చేస్తుండగా విద్యుత్‌షాక్
ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
ఒకరి పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment