పిల్లలకు తీవ్ర ఇబ్బందులు
పాఠశాలల సమయం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు మార్చడం వల్ల ఫీడింగ్ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. స్కూల్ ముగిసిన తర్వాత వారి గ్రామాలకు వెళ్లే లోపు చీకటి పడుతుంది. దీంతో విద్యార్థులు త్వరగా అలసిపోయి వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక శాస్త్రవేత్తలూ హెచ్చరిస్తున్నారు. కాగా, సంఘాల నిర్ణయం కూడా తీసుకోకుండా మోడల్‌గా అని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తారేమో అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఉపాధ్యాయులు, విద్యార్థుల మనోభావాలు, స్థానిక పరిస్థితులు తెలుసుకుని ముందుకు వెళితే బాగుంటుంది.
– ఎస్‌వీవీ రమణయ్య, జిల్లా గౌరవాధ్యక్షుడు, యూటీఎఫ్
Comments
Please login to add a commentAdd a comment