విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
● ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్‌రెడ్డి
బుక్కరాయసముద్రం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్‌రెడ్డి సూచించారు. మంగళవారం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని బీసీ బాలికల హాస్టల్, కేజీబీవీ పాఠశాలలతో పాటు నార్పల మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావుపూలే గురుకుల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడి చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు సంగీతకుమారి, నాగవేణి, ఎంఈఓ కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.
పాడుబడిన భవనాల్లో అంగన్‌వాడీలా?
తాడిపత్రి టౌన్/రూరల్: పాడుబడిన భవనాల్లో అంగన్‌వాడీ కార్యకలాపాలు నిర్వహించడం తగదని ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్‌రెడ్డి అన్నారు. తాడిపత్రి మండలంలోని చుక్కలూరు హైస్కూల్‌తో పాటు అంగన్‌వాడీ సెంటర్‌ను, పట్టణంలోని జయనగర్ కాలనీ, నందలపాడులోని జూటూరు కాలనీలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. పిల్లల కడుపు కొడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. భవనాల్లో మరమ్మతులు చేపట్టకపోవడంపై స్పందించారు. వేరే చోట్లకు మార్చాలని సిబ్బందికి సూచించారు. అయితే, రూ. 6 వేలు బాడుగ ఇస్తామన్నా కాలనీల్లో భవనం దొరకడం లేదని అంగన్‌వాడీ అధికారులు ఆయనకు చెప్పడంతో స్థానికులు అవాక్కయ్యారు. పైగా, చైర్మన్ రాక గురించి రెండు రోజుల ముందే తెలియడంతో ఎన్నడూ లేని విధంగా పిల్లలను, బాలింతలను, గర్భిణులను తరలించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఈఓ ప్రసాద్ బాబు, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment