బాలికపై అత్యాచారం
గార్లదిన్నె: మండల పరిధిలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఆమె గర్భం దాల్చడంతో విషయం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ముంటిమడుగుకు చెందిన వంశీ వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రోజూ కల్లూరు నుంచి వ్యవసాయ కూలీలను పనుల నిమిత్తం వ్యానులో తీసుకుని వెళ్లి.. మళ్లీ సాయంత్రం పని ముగిసిన తరువాత గ్రామానికి తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో బాలికతో వంశీ పరిచయం పెంచుకుని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు.పలుమార్లు అత్యాచారం చేశాడు. పదో తరగతి వరకు చదివిన బాధిత బాలికకు తల్లిదండ్రులు లేకపోవడంతో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ రోజూ వ్యవసాయ పనులకు వెళ్లేది. సోమవారం అర్ధరాత్రి కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకుంది. నీరసంగా ఉండి కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే పామిడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఏడు నెలల గర్భిణి అని నిర్ధారించారు. ఈ క్రమంలోనే వైద్యుల సూచన మేరకు బాలికను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. వారి ఫిర్యాదు మేరకు నిందితుడు వంశీపై పోక్సో, రేప్ కేసులు నమోదు చేశారు.
గర్భం దాల్చడంతో ఆస్పత్రిలో చికిత్స
నిందితుడిపై పోక్సో, రేప్ కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment