వంద శాతం లక్ష్య సాధనపై దృష్టి
అనంతపురం అగ్రికల్చర్: ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు లక్ష్యాలు సాధించడంపై మార్కెట్ కమిటీలు దృష్టి సారించాలని మార్కెటింగ్‌శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సి.రామాంజనేయులు ఆదేశించారు. శనివారం నగరంలోని మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో రెండు జిల్లాల ఏడీఎంలు పి.సత్యనారాయణచౌదరి, ఎల్‌ఎన్ మూర్తితో కలిసి 17 మార్కెట్ కమిటీల సెక్రటరీలు, సూపర్‌వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతపురం జిల్లా పరిధిలో ఉన్న 9 మార్కెట్ కమిటీలు, 15 చెక్‌పోస్టుల ద్వారా ఈ ఏడాది రూ.12.06 కోట్లు లక్ష్యం కాగా.. ఎనిమిది నెలలకు గానూ 55 శాతం రూ.6.70 కోట్లు వసూలైందన్నారు. గతేడాది కన్నా ఈసారి రూ.26 లక్షల వరకు ఆదాయం తగ్గిందన్నారు. అనంతపురం, శింగనమల, తాడిపత్రి కమిటీల పరిస్థితి బాగానే ఉన్నా మిగతా వాటిల్లో పురోగతి లేదన్నారు. గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, ఉరవకొండ కమిటీల్లో ఆదాయం పెంచాలని ఆదేశించారు.
● అలాగే శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో ఉన్న 8 మార్కెట్ కమిటీలు, 16 చెక్‌పోస్టుల ద్వారా ఈ ఏడాది రూ.5.31 కోట్లు టార్గెట్ కాగా ఇప్పటి వరకు 61 శాతంతో రూ.3.24 కోట్లు వసూలు చేశారని మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ తెలిపారు. వ్యవసాయోత్పత్తుల సీజన్ కావడంతో విజిలెన్స్ బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. చెక్‌పోస్టులు, మార్కెట్‌యార్డుల్లో నిఘా పెంచాలన్నారు. పశువులు, జీవాలు, చీనీ, చింత, మిరప తదితర మార్కెట్ల ద్వారా ఆదాయం పెంచుకోవాలని సూచించారు. మార్కెట్‌యార్డుల్లో రైతులకు అందిస్తున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్షించారు.
మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment