హంద్రీ–నీవా కాలువ వెడల్పు తగ్గించడం దారుణం
గుత్తి: హంద్రీ–నీవా కాలువ వెడల్పును తగ్గించి నీటి ప్రవాహ సామర్థ్యాన్ని కుదిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ మండిపడ్డారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం 6,400 క్యూసెక్కుల నీటి ప్రవాహ సామర్థ్యంతో హంద్రీనీవా కాలువను వెడల్పు చేసే పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ఆ సమయంలో ఎన్నికలు రావడంతో పనులు ముందుకు కదల్లేదన్నారు. ఎన్నికల అనంతరం ఏర్పడిన కూటమి సర్కార్ గత ప్రభుత్వ ప్రతిపాదిత పనులను అటకెక్కించి నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 3,425 క్యూసెక్కులకు పరిమితం చేయడంతో పాటు లైనింగ్ పనులు చేపట్టేలా జీఓలు జారీ చేయడం సిగ్గుచేటన్నారు. ఈ పనులు పూర్తయితే జిల్లాకు చుక్క నీరు అందకుండా పోతుందని, అంతేకాక ఉమ్మడి జిల్లా మీదుగా కుప్పం ప్రాంతానికి నీళ్లు తరలించే కుట్రకు సీఎం చంద్రబాబు తెరలేపారన్నారు. రైతులకు జరిగే అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 18 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకూ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. జేసీ ప్రభాకరరెడ్డి బస్సులను తగుల బెట్టింది ఎవరో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment