‘దుర్గం’లో రెడ్ బుక్ అరెస్టు
క్లాస్–4 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం కార్పొరేషన్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న క్లాస్–4 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈ. భ్రమరాంబ దేవి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 18 ఎఫ్‌ఎన్‌ఓ, 11 శానిటరీ వాచ్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. https:// ananthapuramu.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 20లోపు పూర్తి చేసి డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
రేపటి నుంచి
సంక్రాంతి సెలవులు
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాలలకు ఈనెల 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబు తెలిపారు. 2024–25 అకడమిక్ కేలండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. 20న పాఠశాలలు పున:ప్రారంభమవుతాయన్నారు. మైనార్టీ విద్యా సంస్థలకు 11 నుంచి 15 వరకు సెలవులు ఉంటాయని డీఈఓ తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు సంబంధించి వందరోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈనెల 10 నుంచి 12 వరకు ఇంటివద్ద సన్నద్ధం కావాల్సి ఉంటుందన్నారు. 13 నుంచి 15 వరకు యాక్షన్ ప్లాన్ అమలు ఉండదన్నారు. తిరిగి 16 నుంచి 19 వరకు ఇంటివద్దే సన్నద్ధం కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
కళ్యాణదుర్గం: పట్టణంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ కూటమి నేతలు రెడ్‌బుక్ అరెస్టులు చేయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే బుధవారం కళ్యాణదుర్గం మార్కెట్‌యార్డు మాజీ చైర్ పర్సన్ బిక్కి నాగలక్ష్మి భర్త, వైఎస్సార్‌సీపీ నేత బిక్కి హరిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. కళ్యాణదుర్గం మునిసిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్‌ను దూషించి, విధులకు ఆటంకం కలిగించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీని ఆధారంగా డీఎస్పీ రవి బాబు, సీఐ యువరాజు ఆదేశాల మేరకు పోలీసులు హరిని అరెస్టు చేశారు.
చర్చించినందుకే కేసు
కమిషనర్ వంశీకృష్ణను మంగళవారం బిక్కి హరి కలిశారు. మునిసిపాలిటీలో తమ పార్టీ కౌన్సిలర్లకు కూడా విలువ ఇవ్వాలని కోరారు. ఒకే పార్టీకి వత్తాసు పలకడం సరికాదన్నారు. ఇంతకుమించి అక్కడేమీ జరగలేదు. అయినప్పటికీ కమిషనర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగిస్తూ.. తనను దూషించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుల ఓవరాక్షన్
బిక్కిహరి అరెస్టు విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య, రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి పార్టీ శ్రేణులతో కలిసి కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే హరిని పరామర్శించేందుకు కూడా వెళ్లనీయకుండా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. సీఐ యువరాజుతో చర్చించిన అనంతరం నేతలు పోలీసు కస్టడీలో ఉన్న బిక్కి హరిని పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఎఫ్‌ఐఆర్ ఇచ్చేందుకు కూడా నిర్లక్ష్యం
పోలీసు స్టేషన్ నుంచి రాత్రి 8 గంటలకు సీఐ యువరాజు.. బిక్కి హరిని జడ్జి ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్లారు. అయితే మధ్యాహ్నం సమయానికే రిమాండు రిపోర్టుతో పాటు ఎఫ్‌ఐఆర్‌ను సిద్ధం చేసిన పోలీసులు హరి తరఫున న్యాయవాదులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ కాపీలను ఇచ్చేందుకు నిరాకరించారు. బెయిల్ రానివ్వకుండా రాజకీయ ఒత్తిళ్లతో ఈ పన్నాగం పన్నినట్లు పార్టీ శ్రేణులు మండిపడ్డాయి.అయితే ..జడ్జి నివాసానికి తీసుకెళ్లే 20 నిమిషాల ముందు ఎఫ్‌ఐఆర్ కాపీ ఇవ్వడం కొసమెరుపు. అనంతరం జూనియర్ సివిల్ జడ్జి సుభాన్ ముందు హాజరుపరచగా.. ఆయన కేసు పూర్వపరాలను పరిశీలించి బెయిల్ మంజూరు చేశారు.
ఉద్యోగులను ఉసిగొలిపి..
కమిషనర్ బుధవారం ఉదయం మునిసిపల్ సిబ్బందిని, సచివాలయ ఉద్యోగులను ఉసిగొల్పి పట్టణంలో బిక్కి హరికి వ్యతిరేకంగా ర్యాలీ చేయించారు. అనంతరం పట్టణ పోలీసు స్టేషన్ ఆవరణలో నినాదాలు చేస్తూ పోలీసులకు బిక్కి హరిపై ఫిర్యాదు చేశారు.
వైఎస్సార్‌సీపీ నేత
బిక్కి హరి అక్రమ అరెస్టు
పట్టణ పోలీసు స్టేషన్ వద్ద
పోలీసుల ఓవరాక్షన్
హరిని పరామర్శించిన పార్టీ సమన్వయకర్త తలారి రంగయ్య
అక్రమ అరెస్టులు సహించబోం
బిక్కిహరిని అరెస్టు చేయడం సరైంది కాదు. నేను పోలీసు అధికారిగా, మునిసిపల్ కమిషనర్‌గా, డీఆర్‌డీఏ పీడీగా పనిచేశా. నాతో పాటు పార్టీ శ్రేణులు ఎప్పుడూ ఉద్యోగులుగా అండగానే ఉంటున్నాం. కానీ ఇక్కడి కమిషనర్ రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదు. మునిసిపల్ కౌన్సిల్ మీట్ పెట్టాలని పాలక వర్గం పలుమార్లు కమిషనర్‌ను కోరినా పట్టించుకోలేదు. ఆయన వ్యవహార శైలిపై కలెక్టర్, మునిసిపల్ రీజినల్ డైరెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశాం. ఇలాంటి అక్రమ కేసులకు మేము భయపడేది లేదు.
– తలారి రంగయ్య, వైఎస్సార్‌సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ
సమన్వయకర్త
Comments
Please login to add a commentAdd a comment