కీలకమైన ఖరీఫ్ సమయంలో వరుణుడు ముఖం చాటేశాడు. అంతోఇంతో ప
రాప్తాడులో ఉలవ పంటను పరిశీలించి రైతు ద్వారా
వివరాలు తెలుసుకుంటున్న కరువు బృందం సభ్యులు
అనంతపురం అగ్రికల్చర్/రాప్తాడు: ‘గతి తప్పిన వర్షాలకు సాగు చేసిన పంటలన్నీ తుడిచిపెట్టుకు పోయాయి. ప్రత్యామ్నాయ పంటలు కూడా దెబ్బ తిన్నాయి. రాష్ట్రం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదు. కేంద్రం నుంచి చేయూత అందించి ఆదుకోకపోతే మా పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది’ అంటూ కేంద్ర కరువు బృందం ఎదుట జిల్లా రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకునే నిమిత్తం బుధవారం ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ) జిల్లాలో పర్యటించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన అండర్ సెక్రటరీ జయంతి కనోజియా, ఏపీ సీడ్స్ డెవలప్‌మెంట్ డైరెక్టర్, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కె.పొన్నుస్వామితో కూడిన ఇద్దరు సభ్యుల బృందం బుధవారం మధ్యాహ్నం అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామంలో పర్యటించారు. రైతు వన్నూరప్పకు చెందిన ఆముదం పొలం పరిశీలించారు. కరువు పరిస్థితులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లాకు రూ.112.05 కోట్ల సాయం అందించి ఆదుకోవాలని కలెక్టర్ వినోద్‌కుమార్ కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు. రైతులకు రూ.10.93 కోట్లు, పశుశాఖకు రూ.12.15 కోట్లు, గ్రామీణనీటి సరఫరాకు రూ.6.73 కోట్లు, పట్టణ తాగునీటి సరఫరాకు రూ.3.35 కోట్లు, డ్వామా పరిఽధిలో ఉపాధిహామీ పథకానికి అదనంగా రూ.78.89 కోట్లు ఇవ్వాలని కోరారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, పెద్దమనసుతో ఆదుకోవాలని ఓబిరెడ్డి, తదితర రైతులు మొరపెట్టుకున్నారు. 10 ఎకరాల వరకు 90 శాతంతో డ్రిప్, స్ప్రింక్లర్లు ఇవ్వాలని, ఉపాధి హామీ కింద అదనపు పనిదినాలు కల్పించాలని, పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు.
ఆత్మహత్యలే శరణ్యం..
మన్నీల పర్యటన అనంతరం స్థానిక ఆర్‌డీటీ అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు కేంద్ర బృంద సభ్యులు రాప్తాడు మండలంలో పర్యటించారు. పామళ్ల కొండప్పకు చెందిన ఉలవ పంటను పరిశీలించారు. పంట కోసం దాదాపు రూ.2.50 లక్షల పెట్టుబడి పెట్టానని, ఎకరాకు బస్తా దిగుబడి కూడా రాకతీవ్రంగా నష్టపోయాయని కొండప్ప వాపోయారు. అనంతరం కేంద్ర బృంద సభ్యులు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పంపు కొండప్ప, అమరనాథరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, వెంకటేష్, శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ ప్రధాన పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటలు కూడా తీవ్రంగా దెబ్బతినడంతో తమ పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పశువులకు గ్రాసం కూడా దొరకడం లేదన్నారు. కేంద్రం నుంచి సాయం అందించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వెలిబుచ్చారు. రైతులకు డ్రిప్ మంజూరులో 18 శాతం జీఎస్‌టీ వేస్తున్నారని, దాన్ని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు పరిటాల సునీత, దగ్గుపాటి ప్రసాద్‌తో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు కేంద్ర బృందానికి వినతి ప్రత్రాలు అందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి, డ్వామా పీడీ సలీంబాషా, ఉద్యానశాఖ డీడీ బీఎంవీ నరసింహారావు, ఏడీఏలు ఎం.రవి, ఓబుళపతి, యల్లప్ప, లక్ష్మానాయక్, టెక్నికల్ ఏఓ బాలానాయక్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల ఏ‘కరువు’
పంటలన్నీ పోయాయి.. అప్పులే మిగిలాయి
రాష్ట్ర ప్రభుత్వం నుంచి
రూపాయి సాయం అందలేదు
దయ చూపకుంటే
ఆత్మహత్యలే శరణ్యం
కేంద్ర కరువు బృందానికి
జిల్లా రైతుల వేడుకోలు
రూ.112.05 కోట్ల సాయం
అందించాలని కలెక్టర్ నివేదిక
Comments
Please login to add a commentAdd a comment