గడువులోపు అహుడా లే ఔట్ల పూర్తి
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం–హిందూపురం డెవలప్‌మెంట్ అథారిటీ (అహుడా) లే ఔట్లను నిర్దేశిత గడువులోపు పూర్తి చేసి అందుబాటు ధరలో వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నట్లు అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ పేర్కొన్నారు. బుధవారం అహుడా కార్యాలయంలో అహుడా వైస్ చైర్మన్, జేసీ శిశ్‌నారాయణ్ శర్మతో కలసి ఆయన మాట్లాడారు. అంతకు ముందు కూడేరు, గుత్తి, మడకశిర ప్రాంతాల్లో నూతన ఎంఐజీ లే అవుట్ల బ్రోచర్లను ఆవిష్కరించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరులో 28.25 ఎకరాల్లో 390, మడకశిరలో 9.3 ఎకరాల్లో 123, గుత్తిలో 11.82 ఎకరాల్లో 123 ప్లాట్లను వేస్తున్నట్లు తెలిపారు. 40 అడుగుల సీసీ రోడ్లు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, నీటి సరఫరా, సీవెజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, కరెంటు సరఫరా, తదితర మౌలి క సదుపాయాలు కల్పిస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రైవేట్ వెంచర్లకు దీటుగా అహుడా లే అవుట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీతో స్థలాల ను అందించనున్నామన్నారు. సమావేశంలో అహుడా కార్యదర్శి గౌరిశంకర్ రావు, కమ్మూరు పీఓ మహమ్మద్ ఇషాక్ అహమ్మద్; ఈఈ దుశ్యంత్, జేపీఓ హరీష్ చౌదరి, సర్వేయర్ శరత్‌బాబు, డీఈ రేవంత్‌రెడ్డి, ప్లానింగ్ కార్యదర్శులు ప్రమీల, నాగశ్రీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment