ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
రాప్తాడు రూరల్: జిల్లాకు కేంద్రం నుంచి రూ. 10 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని సీపీఎం నాయకులు విన్నవించారు. ఈ మేరకు కేంద్ర బృందం సభ్యులకు వినతి పత్రం అందజేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప మాట్లాడుతూ రైతు రుణాలు మాఫీ చేయాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం అందించాలన్నారు. కూలీలకు ఉపాధిహామీ కింద అదనపు పనిదినాలు కల్పించాలన్నారు. పంటల బీమా ప్రీమియం ప్రభుత్వమే భరించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, రామాంజినేయుల తదితరులు ఉన్నారు.
31 మండలాల్లోనూ కరువు
జిల్లాలోని 31 మండలాల్లోనూ కరువు విలయతాండవం చేస్తోందని, ఉదారంగా రైతులను ఆదుకోవాలని కేంద్ర బృందం సభ్యులను సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ కోరారు. దెబ్బతిన్న ఆహార పంటలకు ఎకరాకు రూ.30 వేలు, వ్యవసాయ పంటలకు రూ.50 వేలు, ఉద్యాన పంటలకు రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. ఉపాధి పని దినాలను 200కు పెంచాలన్నారు. బోరు బావులకు మీటర్లు బిగించరాదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
● జిల్లాలో కరువు నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందం సభ్యులకు సీపీఐ రైతు సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున, జిల్లా అధ్యక్షులు చెన్నప్ప యాదవ్, ఉపాధ్యక్షుడు పి. రామకృష్ణ, నాయకులు ఎం. రామకృష్ణ, ఎం. రమేష్, మన్నీల వెంకట రాముడు, నాగేష్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment