రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో సత్తా
అనంతపురం ఎడ్యుకేషన్: రెండు రోజుల పాటు విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించిన ప్రాజెక్ట్‌లు సత్తా చాటాయి. విద్యార్థి, టీచర్ విభాగాల నుంచి ఒక్కో ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశ సైన్స్ ఫెయిర్‌కు ఎంపికయ్యాయి. బుధవారం రాష్ట్రస్థాయి ప్రదర్శన ముగిసింది. జిల్లా నుంచి మొత్తం ఆరు ప్రాజెక్ట్‌లు పాల్గొన్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబు, జిల్లా సైన్స్‌అధికారి బాలమురళీ తెలిపారు. విద్యార్థి విభాగం నుంచి కణేకల్లు మండలం హనకనహల్ జెడ్పీహెచ్‌ఎస్ 9వ తరగతి విద్యార్థినులు పి. గీతా రెడ్డి, డి. మహాలక్ష్మి తయారు చేసిన ‘వృద్ధులకు ఊత కర్ర’, టీచర్స్ విభాగం నుంచి ఉరవకొండ మండలం ఆమిద్యాల జెడ్పీహెచ్‌ఎస్ భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు బండి శ్రీనివాసులు తయారు చేసిన ‘కాంతి ధర్మాలను సులువుగా వివరించేందుకు ఉపాధ్యాయులకు ఉపకరించే పరికరాలు’ ప్రాజెక్ట్‌లు దక్షిణభారతదేశ స్థాయికి ఎంపికయ్యాయని వెల్లడించారు. వీరికి సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసపత్రాలు అందజేశారు. పాండిచ్చేరిలో జరిగే జాతీయస్థాయి సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో వీరి ప్రాజెక్ట్‌లు పదర్శించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment