చెరువులో వ్యక్తి మృతదేహం
గుంతకల్లు రూరల్: ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి బుధవారం వైటీ చెరువులో మృతదేహం తేలాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వైటీ చెరువు గ్రామానికి చెందిన హుస్సేన్‌పీరా (74), షేకూన్‌బీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 2న పొలానికి వెళ్లి వస్తానంటూ ఇంటి నుంచి బయటకు పోయిన హుస్సేన్‌పీరా ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. కుటుంబసభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రెండు రోజుల క్రితం బాధిత కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు గుంతకల్లు రూరల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి, గాలింపు చేపట్టారు. బుధవారం ఉదయం వైటీ చెరువు గ్రామంలోని చెరువులో ఓ పురుషుడి మృతదేహం తేలియాడుతుండడం గమనించిన స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించారు. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న షేకూన్‌బీ కుటుంబసభ్యులు మృతుడిని గుర్తించి హుస్సేన్‌పీరాగా నిర్దారించారు. పొలం పక్కనే ఉన్న చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెంది ఉంటాడనే అనుమానాలను బాధిత కుటుంబసభ్యులు వ్యక్తం చేయడంతో ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment