అవినీతిపై ఏసీబీ విచారణ చేపట్టాలి
గుంతకల్లు టౌన్: ‘మున్సిపల్ కార్యాలయంలో అవినీతి విచ్ఛలవిడిగా జరుగుతోంది. దీనిపై ఏసీబీ విచారణ చేపట్టాలి. ఈ మేరకు కలెక్టర్‌ను కోరబోతున్నా’ అంటూ టీడీపీ కౌన్సిలర్ పవన్‌కుమార్ గౌడ్ అన్నారు. ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్న పన్నులను పట్టణాభివృద్ధికి వెచ్చించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వైఖరిని నిరసిస్తూ తాను బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి, బయటకు వెళ్లిపోయారు. మంగళవారం గుంతకల్లు మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్.భవాని అధ్యక్షతన జరిగిన మున్సిపల్ (బడ్జెట్) ప్రత్యేక సమావేశం ఇందుకు వేదికై ంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.96.52 కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్‌ను అకౌంట్స్ అధికారులు ప్రవేశపెట్టగా, కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకు ముందు పవన్‌కుమార్ గౌడ్ మాట్లాడారు. కౌన్సిల్ మీట్‌కు రావడం, అజెండాల్లోని అంశాలను ఆమోదించడం పరిపాటిగా మారిందే తప్ప వార్డుల్లో కనీస వసతులను కల్పించలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందన్నారు. అధికారుల అవినీతి, పక్షపాత వైఖరిని నిరసిస్తూ తాను బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు పేర్కొనడంతో మరో ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లు సుధాకర్, విజయ్, రవి కూడా సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. కాగా, ప్రీ ఆడిట్ అధికారులు అన్నింటికీ కొర్రీలు వేస్తున్నారంటూ పలువురు కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఈ వైఖరి వీడాలని మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ నైరుతి రెడ్డి హితవు పలికారు.
అధికారుల వైఖరిపై టీడీపీ కౌన్సిలర్ పవన్‌కుమార్‌గౌడ్ మండిపాటు
బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించిన నలుగురు టీడీపీ కౌన్సిలర్లు
Comments
Please login to add a commentAdd a comment