అధిక దిగుబడినిచ్చే వంగడాలను సృష్టించాలి
శింగనమల: రైతులకు ఉపయోగపడేలా అధిక దిగుబడినిచ్చే నూతన వంగడాలను సృష్టించే శాస్త్రవేత్తలుగా ఎదగాలని వ్యవసాయ కళాశాల విద్యార్థులకు రెడ్డిపల్లి కేవీకే పోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ మల్లేశ్వరి పిలుపునిచ్చారు. మంగళవారం శింనగమల మండలం నాయనవారిపల్లిలో ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలోని ఎస్‌బీవీఆర్ కళాశాలకు చెందిన విద్యార్థులు రైతు సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ మల్లేశ్వరి మాట్లాడారు. రైతులతో కలసి పంటల సాగు విధానాలు అధ్యయనం చేయడంతో పాటు నూతన సాగు విధానాలు, వంగడాలపై రైతులను చైతన్య పరచడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు రూపొందించిన వ్యవసాయ ప్రాజెక్ట్ నమూనాలను పరిశీలించారు. రెడ్డిపల్లి ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త డాక్టర్.భార్గవి, ఏఆర్‌ఎస్ రేకులకుంట శాస్త్రవేత్త జి.నారాయణస్వామి, తహసీల్దార్ బ్రహ్మయ్య, గుత్తి ఏడీఏ వెంకటరాముడు, మండల వ్యవసాయాధికారి అన్వేష్‌కుమార్, సబితా, మాధవి, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment