కదిరిలో నకిలీనోట్ల కలకలం
● పొట్టేళ్లు కొని నకిలీ నోట్లిచ్చిన కేటుగాళ్లు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత రైతు
కదిరి అర్బన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో కొందరు కేటుగాళ్లు రైతు నుంచి పొట్టేళ్లు కొనుగోలు చేసి నకిలీ కరెన్సీ నోట్లు అంటగట్టారు. అవి నకిలీ నోట్లని ఆలస్యంగా తెలుసుకున్న రైతు.. కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..ముదిగుబ్బ మండలానికి చెందిన రైతు నగేష్ తన పొట్టేళ్లు అమ్ముకునేందుకు మంగళవారం కదిరి వ్యవసాయ మార్కెట్‌యార్డుకు వచ్చారు. ఇద్దరు యువకులు బేరమాడి నగేష్ వద్ద ఉన్న ఒక్కో పొట్టేలు రూ.16,250 చొప్పున రెండూ కలిపి రూ.32,500 కొనుగోలు చేశారు. అనంతరం ఆయనకు డబ్బులిచ్చి పొట్టేళ్లు తీసుకువెళ్లారు. అనంతరం రైతు నగేష్ కదిరిలోని తన బంధువు వద్దకు వెళ్లి డబ్బు అతనికి ఇచ్చాడు. అయితే అవి నకిలీ నోట్లని గుర్తించిన అతను అదే విషయాన్ని రైతు నగేష్‌కు చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించి నగేష్ వెంటనే కదిరి రూరల్ అప్‌గ్రేడ్ పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు మార్కెట్‌యార్డ్‌లోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. దుండగులు మాస్క్‌లు ధరించి కనిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment