కాల్షియం కార్బైడ్‌తో మాగబెట్టొద్దు
అనంతపురం అగ్రికల్చర్: ప్రజారోగ్యానికి హాని కలిగించే కాల్షియం కార్బైడ్‌తో పండ్లను మాగబెట్టడం మంచిది కాదని ఉద్యానశాఖ డీడీ బీఎంవీ నరసింహారావు తెలిపారు. అరటి, మామిడిని మాగబెట్టేందుకు కాల్షియం కార్బైడ్ వాడినట్లు గుర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మంగళవారం ఆయన మార్కెటింగ్‌శాఖ ఏడీ పి.సత్యనారాయణచౌదరి, ఉద్యానశాఖ హెచ్‌ఓ రత్నకుమార్‌తో కలిసి స్థానిక మార్కెట్‌యార్డు ప్రాంగణంలో, సంగమేశ్వర సర్కిల్‌లో ప్రైవేట్ మండీ వ్యాపారులు నిర్వహిస్తున్న రైపనింగ్ చాంబర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 లక్షల ఎకరాల్లో ఉద్యాన తోటలు విస్తరించాయన్నారు. అరటి, మామిడి, బొప్పాయి, సీతాఫలం, పనస, సపోటా తోటల్లో పక్వానికి రాకమునుపే తొలగించి కాల్షియం కార్బైడ్‌తో మాగబెడుతుండటంతో అనర్థాలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ పద్ధతిని నిర్మూలించేందుకు ప్రభుత్వాలు రైపనింగ్ చాంబర్లను ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఆసక్తి కలిగిన వారు ముందుకు వస్తే యూనిట్‌కు అయ్యే ఖర్చులో 35 శాతం మేర రాయితీ వర్తింపజేస్తామని, గరిష్టంగా రూ.10 లక్షల వరకు యూనిట్ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఒక టన్ను సామర్థ్యం కలిగిన రైపనింగ్ చాంబర్‌కు రూ.లక్ష ఖర్చవుతుండగా, 35 శాతం రాయితీ ఇస్తామని తెలిపారు. వివరాలకు 79950 86792లో సంప్రదించాలని సూచించారు.
ఉద్యానశాఖ డీడీ నరసింహారావు
Comments
Please login to add a commentAdd a comment