జెడ్పీటీసీలకు గౌరవ వేతనం మంజూరు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీలకు గౌరవ వేతనం మంజూరు

Published Wed, Jan 8 2025 12:34 AM | Last Updated on Wed, Jan 8 2025 12:34 AM

-

అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలోని 63 మంది జెడ్పీటీసీలు, ఇద్దరు కో–ఆప్షన్‌ సభ్యులకు గౌరవ వేతనం మంజూరైంది. 2024, మార్చి ఒకటి నుంచి జెడ్పీ చైర్‌పర్సన్‌ సహా జెడ్పీటీసీలు, కో–ఆప్షన్‌ సభ్యులకు గౌరవ వేతనం మంజూరు కాలేదు. ఈ అంశంపై సమావేశాల్లో పలుమార్లు సభ్యులు జిల్లా స్థాయి అధికారులను నిలదీశారు. ఈ నేపథ్యంలో గౌరవవేతనం చెల్లింపులకు రూ.50 లక్షలు అవసరమని జెడ్పీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపగా... రూ.34 లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మొత్తాన్ని ప్రజాప్రతినిధుల వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య మంగళవారం తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement