జీజీహెచ్‌లో 20 పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు
అనంతపురం మెడికల్: ఎట్టకేలకు ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యులు మేలుకున్నారు. బెంగళూరులో హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని మానసిక వైద్య విభాగం వార్డులో మంగళవారం 20 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. వ్యాధి లక్షణాలున్న వారిని అడ్మిట్ చేయాలని సంబంధిత వైద్యులను సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు ఆదేశించారు. మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, పీడియాట్రిక్ హెచ్‌ఓడీలతో తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. కేసులు నమోదైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. కమిటీకి నోడల్ ఆఫీసర్‌గా పల్మనాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ రామస్వామి, సభ్యులుగా మెడిసిన్ హెచ్‌ఓడీ డాక్టర్ బీమసేనాచార్, ఎమర్జెన్సీ మెడిసిన్ హెచ్‌ఓడీ డాక్టర్ శ్రీనివాసులు, పీడియాట్రిక్ హెచ్‌ఓడీ డాక్టర్ రవికుమార్‌తో పాటు మైక్రో బయాలజీ హెచ్‌ఓడీ ఉన్నారు. మైక్రో బయాలజీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఆర్‌టీపీసీఆర్‌లో వైరస్ నిర్ధారణ పరీక్షలు జరగనున్నాయి. దీంతో పాటు ఎన్–95 మాస్క్‌లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు.
ఎస్సీ కులగణనపై 12 వరకు
అభ్యంతరాల స్వీకరణ
అనంతపురం అర్బన్: ఎస్సీ కులగణనపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈనెల 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. 12 తేదీ వరకు నిర్దేశిత ప్రాంతాల్లో ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. ఆన్‌లైన్‌లో ఈనెల 16వ తేదీ వరకు నమోదు చేస్తారన్నారు. అనంతరం అన్ని తనిఖీలు పూర్తి చేసి తుది కులగణన సర్వే వివరాలను ఈనెల 20న గ్రామ, వార్డు సచివాలయాల వద్ద విడుదల చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని మండల ప్రత్యేక అఽధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment