చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్
గుంతకల్లు రూరల్: స్థానిక రూరల్ పీఎస్ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న చోరీ కేసుల్లో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కసాపురం పీఎస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్‌ఐ వెంకటస్వామితో కలసి సీఐ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఇటీవల గుంతకల్లులోని వీవీనగర్‌లో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కొని వెళ్లారు. అలాగే జగ్జీవన్‌రామ్ కాలనీలోనూ చైన్‌స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఈ రెండు చోరీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో సోమవారం గుంతకల్లులోని భగత్‌సింగ్ నగర్‌లోని అయ్యప్పస్వామి ఆలయం వెనక సోమవారం అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో చోరీలకు పాల్పడుతున్నది తామేనని అంగీకరించారు. పట్టుబడిన వారిలో గుత్తిలోని మారుతీ నగర్‌కు చెందిన మోతే రాజేష్, సుందరయ్య కాలనీకి చెందిన మాల ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. వీరి నుంచి 3.5 తులాల బంగారు నగలు, రూ.60 వేల నగదు, గుత్తిలో అపహరించిన 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment