డ్రెయినేజీ కుంటలో పడిన కార్మికురాలు
తాడిపత్రి టౌన్: స్థానిక మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికురాలు ప్రమీల ప్రమాదవశాత్తు డ్రెయినేజీ కుంటలో పడి తీవ్ర అస్వస్థతకు లోనైంది. విధి నిర్వహణలో భాగంగా సోమవారం ఉదయం యూజీడీ ఎస్టీబీ–2 వద్ద మురుగు నీటి శుద్ధి పనుల్లో నిమగ్నమైన ఆమె... అదుపు తప్పి డ్రెయినేజీ కుంటలో పడింది. సకాలంలో తోటి కార్మికులు గుర్తించి ఆమెను వెలికి తీసి, వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న సీఐటీయూ నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి, ఉమాగౌడ్, హనుమంతరెడ్డి ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏఈ తేజా వ్యవహరిస్తూ మురుగునీటి శుద్ధి పనులను కార్మికులతో చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కార్మికులకు కేటాయించిన పనులు మాత్రమే చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment