రూ.2,80,69,45,390
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మెగాసేల్ అనగానే బట్టల షాపులో, మొబైల్ షాపుల్లో అమ్మకాలు అనుకుంటే పొరపాటు పడ్డట్టే. సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని మద్యం ప్రియులకు భారీ స్థాయిలో కిక్కు ఎక్కించేందుకు ‘మెగాసేల్’కు కూటమి సర్కారు కసరత్తు చేస్తోంది. పండుగ మూడు రోజులూ మద్యం షాపుల నిండా స్టాకు పూర్తి స్థాయిలో ఉండేలా ఎకై ్సజ్ విభాగం చర్యలు తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 230 షాపులకు అన్ని రకాల బ్రాండ్‌లు అందుబాటులో ఉంచే విధంగా పంపిణీ ఏర్పాట్లు చేశారు. భారీ స్థాయిలో అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం సంక్రాంతికి మరింతగా పరుగులు పెట్టనుంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 సెప్టెంబర్ 16 నుంచి కొత్త మద్యం పాలసీ వచ్చింది. అప్పటినుంచి 2025 జనవరి 13 వరకూ ఈ రెండు జిల్లాల్లోనే రూ.450 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు తేలింది. మరో 28 బార్లలో జరిగిన అమ్మకాలు దీనికి అదనం. మద్యం షాపుల ఓనర్లు అనంతపురం, రాప్తాడు లాంటి చోట్ల ఉదయం 7 గంటలకే షాపులు తెరుస్తున్నారు. రాత్రి 11 గంటల వరకూ కొనసాగుతున్నాయి. వీటిని పట్టించుకునే నాథులు కరువయ్యారు. అసలు ఎకై ్సజ్ డిపార్ట్‌మెంటు జిల్లాలో ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోంది. ఓవైపు లిక్కర్ తాగి నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు అమ్మకాలు మరింతగా పెంచుతున్నారు. బహిరంగంగా మద్యం తాగినా, ధాబాలు, హోటళ్లలో తాగినా ఎవరికీ పట్టడం లేదు.
అనంతపురం జిల్లాలో మద్యం వినియోగం
33,30,000 లీటర్లు
అనంతపురం జిల్లాలో బీర్‌ల వినియోగం
10,56,808 లీటర్లు
అనంతపురం జిల్లాలో మద్యం, బీర్‌ల విలువ
మెగా సేల్‌కు రంగం సిద్ధం
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
ఫుల్ స్టాకు ఉంచాలని నిర్ణయం
గడిచిన మూడున్నర నెలల్లో
రూ.450 కోట్ల అమ్మకాలు
53.25 లక్షల లీటర్ల
మద్యం వినియోగం
16.48 లక్షల లీటర్ల బీరు
తాగేసిన మద్యంబాబులు
రోజుకు 45,147 లీటర్ల చొప్పున లిక్కర్ వినియోగం
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పర్మిట్ రూములు, బెల్టు షాపులు అనధికారికంగా విచ్చలవిడిగా నడుస్తున్నాయి. ఎక్కడో ఒకచోట తూతూ మంత్రంగా ఎకై ్సజ్ విభాగం దాడులు నిర్వహించి మమ అనిపిస్తోంది. మొన్నటికి మొన్న డిసెంబర్ 31, జనవరి 1వ తేదీన రెండు రోజులు రూ.21 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్టు తేలింది. ఏ ఒక్క పర్మిట్ రూమ్‌ను కానీ, బెల్టుషాపులను కానీ ఎకై ్సజ్ విభాగం చూసిన పాపాన పోలేదు. సంక్రాంతికి మూడు రోజులు కూడా ఎలాంటి దాడులు జరగకుండా చూసేందుకు ఎకై ్సజ్ శాఖ మద్యం షాపుల ఓనర్లతో మాట్లాడుకున్నట్టు తెలిసింది. పైగా అనంతపురంలో ఎక్కువ అమ్మకాలు ఉంటాయి. ఇక్కడ ఎమ్మెల్యేనే ఎనిమిదికి పైగా షాపులు నడిపిస్తున్నారు. అన్ని చోట్లా అనధికార పర్మిట్ రూములు నడుస్తున్నాయి. కానీ ఆ షాపుల వైపు చూడటానికి కూడా ఎకై ్సజ్ అధికారులు భయపడుతున్నారు. కనుమ పండుగ పూర్తయ్యే వరకూ పర్మిట్ రూములు, బెల్టుషాపుల వైపు ఎవరూ కన్నెత్తి చూసే పరిస్థితి లేదు.
నాలుగు నెలల్లో రూ.450 కోట్లు..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గడిచిన నాలుగు నెలల్లో మద్యం అమ్మకాలు
Comments
Please login to add a commentAdd a comment