కళ నింపని.. పండుగ..!
గ్రామాలు కళ తప్పాయి. సంక్రాంతికి సందడిగా ఉండాల్సిన వీధులు మూగబోయాయి. పండుగ సరుకులు కొనేవారు లేక చిరువ్యాపారులకు నిరాశే మిగిలింది. ఎంతో ఆశతో పూలు, గుమ్మడికాయలు, ఇతర పండుగ సామగ్రిని అనంతపురానికి తీసుకొచ్చిన వ్యాపారులు, రైతులు దీనంగా వెనుదిరగాల్సి వచ్చింది. రూ. 25 వేల పెట్టుబడి పెట్టి పూల సాగు చేశామని, కొనుగోలు చేసే వారే లేక భయం పట్టుకుందని పాతూరుకు చెందిన అలివేలమ్మ వాపోయారు. ఇక.. గ్రామాల్లో ఎవరిని కదిపినా ‘డబ్బుల్లేవప్పా... ఇంక పండగ యాడ చేసేది’’ అంటూ నిట్టూరుస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment