ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
బుక్కరాయసముద్రం: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ముస్సోరి ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ (లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్) డైరెక్టర్ శ్రీరామ్ తరణికంటి సూచించారు. సోమవారం స్థానిక గాంధీనగర్ సచివాలయం–4తో పాటు పోలీస్ స్టేషన్‌ను కలెక్టర్ వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన తనిఖీ చేశారు. సచివాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను అనవసరంగా తిప్పుకోకుండా పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, తహసీల్దార్ పుణ్యవతి, ఎంపీడీఓ సాల్మాన్, సీఐ కరుణాకర్, ఈఓఆర్డీ సదాశివం తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ డైరెక్టర్ శ్రీరామ్ తరణికంటి
పండ్ల తోటల పరిశీలన
పుట్లూరు/తాడిపత్రి అర్బన్: పుట్లూరు మండలంలోని ఏ.కొండాపురం గ్రామంలో సోమవారం దానిమ్మ, చామంతి సాగును ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ డైరెక్టర్ శ్రీరామ్ తరిణికంటి పరిశీలించారు. దానిమ్మ సాగుపై రైతులతో ఆరా తీశారు. పెట్టుబడి, దిగుబడులతో పాటు కూలీల ఖర్చు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
తాడిపత్రిలో ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ డైరెక్టర్ శ్రీరామ్ తరణికంటి పర్యటించారు. మున్సిపాలిటీ కార్యాలయాన్ని పరిశీలించారు. విద్యుత్‌ను ఆదా చేయడంలో రాష్ట్రంలోనే నంబర్‌వన్ మున్సిపాలిటీగా నిలిచి బంగారు పతకం సాధించిన తాడిపత్రి మున్సిపాలిటీని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన బుగ్గ రామలింగేశ్వరస్వామి, చింతల వెంకటరమణస్వామి ఆలయాలను ఆయన సందర్శించారు. ఆలయంలోని శిల్పకళను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు.
చుక్కలూరులో నిర్వహిస్తున్న సిద్దార్థ కోల్డ్ స్టోరేజీని శ్రీరామ్ తరణి కంటి పరిశీలించారు. కోల్డ్ స్టోరేజీ సామర్థ్యం, వినియోగం తదితర వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సలీంబాషా, ఏపీఎంఐపీ రఘునాథ్‌రెడ్డి, తహసీల్దార్ రజాక్‌వలి, ఎంఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment