డీలర్‌షిప్ దక్కకుండా చేశాడని అరటి చెట్లు నరికేశారు
● ఐదుగురిని అరెస్టు చేసిన
యల్లనూరు పోలీసులు
యల్లనూరు: డీలర్‌షిప్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు దక్కకుండా చేశాడనే కక్షతో అరటి చెట్లు నరికేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. వివరాలను సోమవారం యల్లనూరు పీఎస్‌లో సీఐ సత్యబాబు వెల్లడించారు. మండలంలోని బొప్పేపల్లి గ్రామ సమీపంలో రైతు సుదర్శననాయుడు సాగు చేసిన అరటి తోటలో ఇటీవల 1,052 చెట్లను నరికివేసిన విషయం తెలిసిందే. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు దర్యాప్తు వేగవంతం చేశారు. పక్కా ఆధారాలతో కుమ్మనమల గ్రామానికి చెందిన మనోహర్, సరేంద్ర, చిన్నపెద్దిరాజు, సురేష్, పెద్దరాజును సోమవారం నారాయణరెడ్డి పల్లి క్రాస్ వద్ద అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో నేరం బయటపడింది. తమకు దక్కాల్సిన ఫీల్డ్ అసిస్టెంట్, స్టోర్ డీలర్‌షిప్‌ను సుదర్శన నాయుడు అడ్డుకున్నాడనే కక్షతో ఆయన ఆర్థిక మూలాలపై దెబ్బతీసినట్లు అంగీకరించారు. దీంతో ఐదుగురిని అరెస్ట్ చేసి, చెట్ల నరికివేతకు ఉపయోగించిన కొడవండ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితులను రిమాండ్‌కుతరలించారు.
Comments
Please login to add a commentAdd a comment