అందరూ ఉన్నా అనాథలై.. | - | Sakshi
Sakshi News home page

అందరూ ఉన్నా అనాథలై..

Published Mon, Jan 20 2025 1:57 AM | Last Updated on Mon, Jan 20 2025 1:57 AM

అందరూ

అందరూ ఉన్నా అనాథలై..

అయిన వారు ఉన్నా ఆ వృద్ధులు అనాథలయ్యారు. బిడ్డల కర్కశత్వంతో రోడ్డున పడ్డారు. బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లికి చెందిన కుళ్లాయమ్మకు ఇద్దరు కుమార్తెలు. భర్త బాలప్ప మరణించాడు. ఇద్దరు కుమార్తెలకూ పెళ్లిళ్లయ్యాయి. కుళ్లాయమ్మకు నెలానెలా పింఛన్‌ వస్తోంది. అమ్మ నుంచి సగం డబ్బు లాక్కుంటున్న కుమార్తెలు.. ఆ తర్వాత మాత్రం పట్టించుకోవడం లేదు. బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన వృద్ధుడు వెంకటరమణది కూడా ఇదే పరిస్థితి. దీంతో వీరు.. అనంతపురంలో భిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జన్మనిచ్చిన వారిని విస్మరిస్తున్న వారికి ఎప్పుడు బుద్ధి వస్తుందో అంటూ సాటి వృద్ధులు ఆవేదన చెందుతున్నారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

No comments yet. Be the first to comment!
Add a comment
అందరూ ఉన్నా అనాథలై.. 1
1/1

అందరూ ఉన్నా అనాథలై..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement