మహనీయుడు యోగి వేమన
అనంతపురం అర్బన్: సమాజంలోని వాస్తవికతను పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో తన పద్యాల ద్వారా వివరించిన మహనీయుడు యోగి వేమన అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన వేమన జయంతి కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డీఆర్‌ఓ ఎ.మలోల ముఖ్య అతిథులుగా హాజరై వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేమన ప్రతి పద్యం సమాజంలోని పరిస్థితులకు అద్దం పడుతుందన్నారు. మధ్య యుగంలో యోగి వేమన వంటి కవులు సులభమైన వాడుక భాషతో సాంస్కృతిక విప్లవానికి నాంది పలికారన్నారు. 500 ఏళ్ల పద్యాలు ఇప్పటికీ వాడుకలో ఉన్నాయని, వీటిని మరింత ముందుకు తీసుకువెళ్లే బాధ్యత అందరిపై ఉందన్నారు. పురాతన చరిత్ర, ఇతిహాసాలకు చెందిన దాదాపు 500 పుస్తకాలు కలెక్టరేట్‌లో ఉన్నాయన్నారు. వీటన్నిటికి అంకెలు వేసి కలెక్టర్ కార్యాలయంలో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి జయకుమార్‌బాబు, కలెక్టరేట్ పరిపాలనాధికారి అలెగ్జాండర్, డీఐపీఆర్‌ఓ గురుస్వామిశెట్టి, విభాగాల సూపరింటెండెంట్లు వసంతలత, యుగేశ్వరిదేవి, కవులు ఏలూరు యంకన్న, శ్రీనివాసరెడ్డి, మధుర శ్రీ, కృష్ణమూర్తి, అప్పస్వామి, రామ్మోహన్‌రెడ్డి, రియాజుద్ధీన్, కంబదూరు నబీరసూల్, నాగభూషణం, నారాయణరెడ్డి, రషీద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment