● సద్వినియోగం చేసుకోవాలి: జేసీ
ఉరవకొండ: రైతులు కందుల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ పిలుపునిచ్చారు. గురువారం ఉరవకొండ మార్కెట్‌యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటా కందులు రూ7,550 మద్ధతు ధరతో కొనుగోలు చేస్తున్నామన్నారు. ఒక్కో రైతు నుంచి సగటున 40 క్వింటాళ్ల వరకు కొంటారన్నారు. ఉరవకొండ డివిజన్‌లో ఇప్పటి వరకూ 177 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. జేడీ ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ రైతుల ఖాతాకు 20 రోజుల్లో నగదు జమ అవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ అధికారిణి అరుణకుమారి, ఆర్‌డీఓ శ్రీనివాస్, మార్కెటింగ్ ఎడీ సత్యనారాయణచౌదరి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ పెన్నేశ్వరీ, వ్యవసాయ శాఖ ఏడీ పద్మావతి, తహసీల్దార్ మహబూబ్‌బాషా, వ్యవసాయ శాఖ అధికారి శుభకర్, ఉరవకొండ పీఎసీఎస్ సీఈఓ శిలార్ గౌస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment