కలెక్టర్, ఎస్పీకి ఉత్తమ అవార్డులు
● తహసీల్దారు, ఇద్దరు బీఎల్‌ఓలకు కూడా..
● ఓటరు జాబితా సవరణలో పనితీరుకు గుర్తింపు
అనంతపురం అర్బన్: ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా అధికారులు, సిబ్బంది రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. ఐఏఎస్, ఐపీఎస్ కేటగిరీలో రాష్ట్రస్థాయి అవార్డుకు కలెక్టర్ వి.వినోద్ కుమార్, ఎస్పీ పి.జగదీష్ ఎంపికయ్యారు. సిబ్బంది విషయానికి వస్తే అనంతపురం అర్బన్ తహసీల్దారు హరికుమార్, బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓ) వి.రూప తేజస్విని, సి.అంజలిని ఎంపిక చేశారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా వీరికి అవార్డులు ప్రదానం చేస్తారు.
ప్రమాద వివరాలు విధిగా నమోదు చేయాలి
● డీఎంహెచ్‌ఓ భ్రమరాంబ దేవి
అనంతపురం మెడికల్: రోడ్డు ప్రమాదాల వివరాలను ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా బేస్ యాప్‌లో విధిగా నమోదు చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈ. భ్రమరాంబ దేవి సూచించారు. యాప్‌పై గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వివిధ నెట్‌వర్క్ ఆస్పత్రుల నిర్వాహకులకు ప్రాజెక్ట్ మేనేజర్ సోమ్లా నాయక్ శిక్షణ ఇచ్చారు. యాప్ విధివిధానాలు, ఆస్పత్రిలో అమలు చేయాల్సిన ప్రోటోకాల్స్ వివరించారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుని మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఎన్‌టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా వైద్యం అందించాలని, క్షతగాత్రుల వద్ద అదనపు వసూళ్లకు పాల్పడకూడదన్నారు. డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డెమో త్యాగరాజు, ఆరోగ్య బోధనాధికారి గంగాధర్, హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేష్, లీగల్ అడ్వైజర్ ఆషారాణి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కబడ్డీ జట్ల ఎంపిక
బత్తలపల్లి: కబడ్డీ క్రీడలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చి జాతీయ జట్టులో స్థానం సంపాదించాలని ఆర్డీటీ రీజినల్ డైరెక్టర్ ప్రమీల కుమారి, ఏటీఎల్ రుక్మాంగద సూచించారు. గురువారం బత్తలపల్లి ఆర్డీటీ క్రీడా మైదానంలో పురుషులు, మహిళల సీనియర్ కబడ్డీ జట్లను ఎంపిక చేశారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నలుమూలల నుంచి 50 మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యారు. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ విశాఖపట్నం జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఎంపికై న క్రీడాకారులు కబడ్డీ పోటీల్లో మంచి ప్రతిభను కనబర్చి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలన్నారు. అలాగే క్రీడా పోటీలతో సమానంగా విద్యలోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.రామ్ తేజ్‌గౌడు, కార్యదర్శి రాగిరి రామయ్య తదితరులు పాల్గొన్నారు.
పురుషుల జట్టు
సిసీంద్రీ, రాజశేఖర్, మధు, కపిల్‌దేవ్, శ్రీధర్, కె.గణేష్, హరిచరణ్, నరేష్, మణిదీప్, ఎస్.గణేష్, శ్రీనివాసులు, దాదా ఖలందర్.
మహిళా జట్టు
ఆయేషా, మేజబి, ధరిణి, ఉష, జయశ్రీ, మానస, గంగోత్రి, నందిని, వాణిశ్రీ, హేమలత, కవిత, నవ్యబాయి.
Comments
Please login to add a commentAdd a comment