● అనంతపురం శివారులోని నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళ
● రెండేళ్ల క్రితం అనంతపురం
నగరంలోని నారాయణ క్యాంపస్
బిల్డింగ్ పై నుంచి భవ్యశ్రీ అనే ఇంటర్ విద్యార్థిని దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. మృత్యువు నుంచి బయటపడినా చికిత్సకు సుదీర్ఘకాలం పట్టింది.
అనంతపురం ఎడ్యుకేషన్: కార్పొరేటు పాఠశాలలు, కళాశాలల తీరు మారడం లేదు. ధనార్జనే ధ్యేయంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఫీజు కట్టకుంటే విద్యార్థులను అవమానాలకు గురి చేస్తున్నారు. ఒక వైపు చదువులు.. మరో వైపు ఫీజుల వేధింపులు.. వెరసి విద్యార్థులు ఒత్తిడి భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కన్నవారికి తీరని శోకం నింపుతున్నారు.
మాయలో తల్లిదండ్రులు..
డబ్బు గుంజడమే ధ్యేయంగా పుట్టుకొచ్చిన కార్పొరేట్ కళాశాలలు... విద్యార్థుల తల్లిదండ్రులను మార్కులు, ర్యాంకుల మాయలో పడేశాయి. తమకంటే పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలనే ఆశ... తల్లిదండ్రులను ఈ మాయలో పడేలా చేస్తోంది. ఈ క్రమంలో పిల్లలు పడుతున్న మానసిక ఒత్తిళ్లను గుర్తించలేకపోతున్నారు. అప్పులు చేసి, ఆస్తులు అమ్మి లక్షలాది రూపాయల ఫీజులు కడుతున్నారు. కళాశాలల్లో వసతులు, యాజమా న్యాలు పెడుతున్న ఒత్తిళ్లను గుర్తించడం లేదు. ఫలితంగా ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అన్యాయంగా బలవుతున్నారు.
చదువుల పేరిట బందీ
కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుల పేరిట విద్యార్థులు బందీలవుతున్నారు. మార్కులు, ర్యాంకులపై విస్తృత ప్రచారం చేస్తుండటంతో తల్లిదండ్రులు ఏమాత్రం ఆలోచించకుండా ఆ కళాశాలల వైపు పరుగులు పెడుతున్నారు. చదువుల పేరిట రోజూ ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులను వేధిస్తున్నారు. సెలవు దినాలనూ వదలడం లేదు. దీనికితోడు ఏ ఒక్క విద్యాసంస్థలోనూ పిల్లలకు క్రీడా పోటీలు నిర్వహించడం లేదు. మానసికోల్లాస తరగతులు కానరావడం లేదు. విశ్రాంతి లేకుండా చదువుల పేరుతో వేధిస్తున్నారు. దీనికితోడు ఫీజులు చెల్లించాలని యాజమాన్యాలు అందరి ముందూ దండించడం, అవమానాలకు గురి చేస్తుండటంతో మరింతగా కుంగిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఆలోచించండి అమ్మానాన్న..
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేరుస్తున్న తల్లిదండ్రులు ఒక విషయం ఆలోచించాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే బంగారు భవిష్యత్తు ఇవ్వొచ్చు కానీ మానసిక ఒత్తిళ్లకు గురై వారికి భవిష్యత్తే లేకుండా పోతే ఏం చేస్తామని పలువురు పేర్కొంటున్నారు. కొందరు ఒత్తిడిని అధిగమించలేక బలవన్మరణాలకు పాల్పడుతుంటే మరికొందరు విద్యార్థులు ఒత్తిడిని తమలోనే దాచుకుంటూ అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. కార్పొరేటు విద్యాసంస్థల ఆగడాలపై ప్రభుత్వ పెద్దలు కూడా దృష్టి సారించాలని విద్యార్థి సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.అన్ని విద్యాసంస్థలు ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మానసిక వికాస తరగతులు, ఆటపాటలు, క్రీడలు కచ్చితంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తీరు మారని యాజమాన్యాలు
ఫీజుల కోసం విద్యార్థులపై తీవ్ర ఒత్తిళ్లు
మానసికంగా చితికిపోతున్న పిల్లలు
ఎటూపాలుపోక బలవన్మరణాలు
మార్కులు, ర్యాంకుల మాయలో మోసపోతున్న తల్లిదండ్రులు
Comments
Please login to add a commentAdd a comment