బ్లాక్‌స్పాట్స్‌లో భద్రతా చర్యలకు శ్రీకారం
అనంతపురం సెంట్రల్: ప్రమాదాలకు నెలవుగా మారిన బ్లాక్‌స్పాట్స్ వద్ద భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు ఉప రవాణా కమిషనర్ వీర్రాజు తెలిపారు. జాతీయ రహదారి భధ్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ, పోలీసు, ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే అధికారులు బ్లాక్ స్పాట్స్‌ను పరిశీలించారు. తాడిపత్రి ప్రాంతాల్లో డీటీసీ వీర్రాజు, అనంతపురం సరిహద్దులో కళ్యాణదుర్గం ఆర్టీఓ రమేష్ ఆధ్వర్యంలో అధికారుల బృందం తనిఖీలు చేసింది. జిల్లాలో 37 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించినట్లు తెలిపారు. ఆయా బ్లాక్ స్పాట్‌లలో ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను గుర్తించి ఈ నెల 31న జరిగే రహదారి భద్రతా సమావేశం దృష్టికి తీసుళ్తామని వివరించారు. కార్యక్రమంలో ఎంవీఐలు శ్రీనివాసులు, సునీత, మనోహర్‌రెడ్డి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment