ఆశ.. మార్పుతోనే మెరుగైన జీవితం
బత్తలపల్లి: ప్రతి ఒక్కరిలోనూ ఆశ, మార్పు ఉన్నప్పుడే సంతోషకరమైన జీవితం సాధ్యమవుతుందని ఆర్డీటీ అసోషియేట్ డైరెక్టర్ సిస్టర్ అన్నేఫెర్రర్ అన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆర్డీటీ ఆధ్వర్యంలో చేపట్టిన అల్ట్రా మారథాన్ రెండో రోజు గురువారం బత్తలపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఘాట్ వద్ద మారథాన్ ముగింపు సభ నిర్వహించారు. ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి అన్నేఫెర్రర్‌తో పాటు ఆర్డీటీ మహిళా సాధికారిత డైరెక్టర్ విశాలా ఫెర్రర్, మారథాన్‌రన్ పౌండర్ జువాన్ మానువెల్, స్పెయిన్‌లో ఆర్డీటీ కార్యకలాపాల పర్యవేక్షకురాలు మయూరిలూథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇలాంటి సమయంలోనే అందరూ ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విశ్వ శాంతి నెలకొల్పడంలో భాగంగా స్పెయిన్ దేశస్తులు, భారతీయులు ఉమ్మడి కార్యాచరణ చేపడదామని పిలుపునిచ్చారు. ఈ అంశంపైనే రెండు రోజుల క్రితం స్పెయిన్ దేశస్తుడు ఒకరు ఉమ్మడి కార్యాచరణ చేపట్టే అంశంపై చర్చించారన్నారు. సమాజాంలో మార్పు కోసం అల్ట్రా మారథాన్‌ను జిల్లాలో చేపట్టిన జువాన్ మానువెల్‌ను అభినందించాల్సిందేన్నారు. ఇలాగే మరో 20, 30 ఏళ్లు మారథాన్‌ను కొనసాగిస్తామన్నారు. రన్‌లో పాల్గొన్న స్పెయిన్ దేశస్తులు, ఇండియాకు చెందిన మొత్తం 120 మందిని అభినందించారు. జువాన్ మానువెల్ మాట్లాడుతూ... ‘ఒక కిలోమీటరు–ఒక జీవితం’ అంటూ మారథాన్ రన్ 170 కిలోమీటర్ల చేపట్టి విజయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో ప్రజలను కలిసినప్పుడు వారు చెప్పిన విషయాలు తమ హృదయాలను కదిలించాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన నిధిని పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు, వివిధ అభివృద్ధి పనులకు వెచ్చించనున్నట్లు వివరించారు. కాగా, మారథాన్ బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు వద్దకు చేరుకోగానే దారి పొడవునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాఘవంపల్లి, బత్తలపల్లిలోనూ ప్రజలు రోడ్లపైకి చేరుకుని స్వాగతం పలికారు. కార్యక్రమంలో స్పాన్సర్ సీబా, సంస్థ డైరెక్టర్లు సాగర్‌మూర్తి, రాజశేఖర్‌రెడ్డి, సాయికృష్ణ, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, రీజనల్ డైరెక్టర్ ప్రమీల కుమారి, రామేశ్వరి, ఏటీఎల్ రుక్మాంగద, సంజీవరెడ్డి, కృష్ణ, బత్తలపల్లి స్పానిస్ బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్డీటీ అసోషియేట్ డైరెక్టర్ సిస్టర్ అన్నేఫెర్రర్
అట్టహాసంగా ముగిసిన అల్ట్రా మారథాన్
Comments
Please login to add a commentAdd a comment