ఆత్మహత్యలకు నిలయంగా నారాయణ విద్యా సంస్థలు
నారాయణ విద్యా సంస్థలు ఆత్మహత్యలకు నిలయంగా నిలుస్తున్నాయి. బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థి చరణ్ మృతదేహాన్ని ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం వారే ఆస్పత్రికి తరలించడం వెనుక ఆంతర్యమేమిటి? నారాయణ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటుండటం బాధాకరం. కరువు జిల్లా అనంతపురంలో విద్యను వ్యాపారంగా చేసి పేద మధ్యతరగతి పిల్లల మరణాలకు కారణమవుతున్న నారాయణ కాలేజీలను సీజ్ చేయాలి. – చంద్రశేఖర్‌యాదవ్,
వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం
జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment