భారీ చోరీ.. పార్థీగ్యాంగ్ పనే?!
అనంతపురం: నగరంలోని రాజహంసా విల్లాస్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన భారీ చోరీ కేసును ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రూ.3.50 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాల, ఆభరణాలతో పాటు రూ. 20 లక్షల నగదు కలిసి మొత్తం రూ.3.70 కోట్ల మేర చోరీ జరిగినట్లు బాధితుడు కొండ్రెడ్డి వెంకట శివారెడ్డి ఫిర్యాదు చేశారు. జిల్లాలోనే అతి పెద్ద చోరీ కావడంతో పోలీసులు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
కీలక సమాచారం లభ్యం..
ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులకు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన ఇంట్లో సేకరించిన వేలిముద్రలతో మహారాష్ట్రకు చెందిన పార్థీ గ్యాంగ్ ముఠా సభ్యుల ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయింది. దీంతో ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మంగళవారం విల్లాలో ఎవరెవరు తిరిగారు? వస్తువులు అమ్మే తరహాలో ఎవరైనా వచ్చారా? రెక్కీ నిర్వహించింది ఎవరు? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. మరో వైపు శివారెడ్డికి తెలిసిన వారి హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఉంటూ విల్లాల్లో అనుమానాస్పదంగా సంచరించే వారి వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. ముఖాలకు మాస్క్‌లు ధరించడంతో పాటు అధునాతన పరికరాలను ఉపయోగించి చోరీలకు పాల్పడ్డారంటే చోరీల్లో నిష్ణాతులైన వారి పనే అని పోలీసులు భావిస్తున్నారు. గతంలో కేవలం ఎస్‌బీఐ ఏటీఎంలనే పార్థీ గ్యాంగ్ కొల్లగొట్టేది. దీంతో జిల్లాలో ఏటీఎంల వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేయగా... ఇప్పుడు శివారు ప్రాంతాల్లోని విల్లాలపై పడటం గమనార్హం.
కేసుపై పోలీసుల ప్రత్యేక దృష్టి
ప్రాథమిక సమాచారం మేరకు మహారాష్ట్ర పార్థీగ్యాంగ్‌గా గుర్తింపు
రంగంలోకి ప్రత్యేక బృందాలు
Comments
Please login to add a commentAdd a comment